ఏజెన్సీలో వర్షాలతో వణుకుతున్న జనం

భారీ వర్షాలు ఏజెన్సీ ప్రాంతాలను ఇబ్బంది పెడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తుతున్నాయి;

Update: 2024-07-20 07:43 GMT
heavy rains, agencys areas, alluri district, andhra pradesh
  • whatsapp icon

భారీ వర్షాలు ఏజెన్సీ ప్రాంతాలను ఇబ్బంది పెడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాన నష్టం జరగకుండా ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. అల్లూరి జిల్లాలో ఏడు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు, వరద ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.

పునరావాస కేంద్రాలు...
ఆహారం,వైద్య సదుపాయాలు,మౌలిక వసతలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. చింతూరు ఏజెన్సీలో వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్బిణీ స్త్రీలు,రోగులను సమీప పీహెచ్ లకు తరలించారు. వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షిస్తున్నారు.


Tags:    

Similar News