Kodali Nani: కొడాలి నానికి ఊరట

మాజీ మంత్రి కొడాలి నాని కి హైకోర్టులో ఊరట లభించింది

Update: 2024-07-08 12:07 GMT

మాజీ మంత్రి కొడాలి నాని కి హైకోర్టులో ఊరట లభించింది. వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడ నాని పై గతంలో కేసు నమోదు కాగా.. ఈ కేసీలో నానిని అరెస్టు చేయవద్దని వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆయనకి 41 ఏ నోటీసులు ఇవ్వాలని విచారణలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని పోలీసులను ఆదేశించింది.

వైసీపీ మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని, ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులతో పాటు మరికొందరిపై సెక్షన్ 447, 506, రెడ్ విత్ 34 ఐపీసీ కింద గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అరెస్టు చేయకుండా ఉండాలని హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని ఆయన లాయర్లు చేసిన వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఆయనకు ఊరటను ఇస్తూ తీర్పు ఇచ్చింది. కొడాలి నానికి 41 ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News