Chandrababu : ముందస్తు బెయిల్ విచారణ రేపటికి వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా;
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అనేక అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును సీఐడీ నిందితుడిగా చేర్చింది. అయితే దీనిపై తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డుపై...
ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయడానికి అక్రమాలు పాల్పడారని, పెద్దయెత్తున ముడుపులు చేతులు మారాయని, క్విడ్ ప్రోకో జరిగిందని తన వాదనలు వినిపించారు. అయితే వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.