ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంటే?
ఆంధప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల మార్చి నెలలో ప్రారంభం కానున్నాయి.;

ఆంధప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల మార్చి నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ టైం టేబుల్ ను విడుదల చేసింది. మార్చి నెలలో ప్రారంభమయ్యే పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యేందుకు అవసరమైన సమయం కూడా ఉండటంతో ముందుగానే సెలవులను చూసుకుని తేదీలను ఫిక్స్ చేసింది. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి.
మార్చి పదిహేడో తేదీ నుంచి...
అలాగే ఫిజికల్స్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకూ జరగనున్నాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఏపీలో పదోతరగతి పరీక్షలు మార్చి 17వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీవరకూ జరగనున్నాయి. మార్చి 31వ తేదీన రంజాన్ వచ్చే అవకాశముండటంతో ఏప్రిల్ ఒకటోతేదీన చివరి పరీక్ష అయిన సోషల్ పేపర్ ఉంటుందని అధికారులు తెలిపారు.