నేడు 40 మండలాల్లో వడగాలులు
ఆంధ్రప్రదేశ్‌లో నేడు నలభై మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది;

kerala high temperature
ఆంధ్రప్రదేశ్‌లో నేడు నలభై మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైెరెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలులు వీచే అవకాశముండటంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ హెచ్చరిక జారీ చేసింది.
ఈ మండలాల్లో...
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకటి, అనకాపల్లి జిల్లాలో పథ్నాలుగు, గుంటూరు జిల్లాలో ఏడు, కాకినాడ జిల్లాలో ఏడు, కృష్ణా జిల్లాలో నాలుగు, ఎన్టీఆర్ జిల్లాలో నాలుగు, పల్నాడు జిల్లాలో ఒకటి, విశాఖపట్నం జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో తొమ్మిదిమండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు కూడా సహకరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది