వైసీపీ ఐదింటిలో ఏకగ్రీవం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఐదు స్థానాల్లో ఏకగ్రీవంగా విజయం సాధించింది.;

Update: 2023-02-28 04:29 GMT

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఐదు స్థానాల్లో ఏకగ్రీవంగా విజయం సాధించింది. మరికొన్ని స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కె.సూర్యనారాయణ, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పి.రామసుబ్బారెడ్డి, చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ సుబ్రహ్మణ్యం, అనంతపురం స్థానిక ఎమ్మెల్సీగా మంగమ్మ, నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మేరుగ మురళీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆ నాలుగులో మాత్రం...
మొత్తం 14 స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయగా ఇందులో తొమ్మిది స్థానాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి చెందినవి. వీటిలో ఐదు స్థానాలు ఏకగ్రీవంకాగా నాలుగు స్థానాలకు మాత్రమే ఎన్నిక జరగాల్సి ఉంది. వీటికి మార్చి పదమూడో తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. మిగిలిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వైసీపీ సొంతం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యమయిందని, గెలుపు ఏకపక్షమని వైసీపీ చెబుతుంది. స్థానిక సంస్థల ప్రతినిధులు తమ పార్టీకి చెందిన వారే ఉండటంతో ఆ నాలుగు స్థానాలను తమ ఖాతాలోకే వేసుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు.


Tags:    

Similar News