జగన్ దిగ్భ్రాంతి.. ఐదు లక్షల పరిహారం

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు వాగులో పడి 9 మంది మరణించారు. దీనిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.;

Update: 2021-12-15 08:56 GMT
ys jagan, prc, andhra pradesh, employees
  • whatsapp icon

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు వాగులో పడి 9 మంది మరణించారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటన విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు జగన్ ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డి గూడెంకు వెళుతున్న ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ఘటనలో డ్రైవర్ చిన్నారావుతో పాటు ఐదుగురు మహిళలు కూడా మృతి చెందారు.

విచారణకు ఆదేశం....
బస్సు ప్రమాదంపై విచారణకు జగన్ ఆదేశించారు. క్షతగాత్రులకు వెంటనే వైద్య సౌకర్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానిని జగన్ ఆదేశించారు. అలాగే బస్సు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి పేర్ని నానిని జగన్ ఆదేశించారు. క్షతగాత్రులందరికీ ఉచితంగా వైద్యం అందించాలని కోరారు.


Tags:    

Similar News