Andhra pradesh : నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి;

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల జరుగుతుంది. రెండో సంవత్సరం విద్యార్థులకు మరుసటి రోజు పరీక్ష ను నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రంలోకి...
పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు, స్మార్ట్ వాచ్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలను అధికారులను ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10.58 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించే అవకాశం లేని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు.