పార్టీ ఫిరాయింపుల విషయం లో.... టీడీపీ ద్వంద వైఖరి..!!

చాలా అవాంతరాలు, ఒడిదుడుకుల నడుమ ఎట్టకేలకు టీడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.... ఒకానొక సందర్భంలో

Update: 2024-09-14 13:30 GMT

చాలా అవాంతరాలు, ఒడిదుడుకుల నడుమ ఎట్టకేలకు టీడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.... ఒకానొక సందర్భంలోటీడీపీ పార్టీ భూస్థాపితం అవటం ఖాయమని అందరూ అనుకున్నారు...కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ....2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని, చరిత్ర సుష్టించింది...

ఈ నేపథ్యంలో... చంద్రబాబు పార్టీ ని కట్టుదిట్టమైన విధానాలతో ముందుకు నడిపిస్తున్నారు... ఇంతకుముందు ప్రభుత్వం చేసిన తప్పులను సరి దిద్దుతూ... తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు...!! ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో.... ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు... వేరే ఏ పార్టీ నుండి అయినా తమ పార్టీకి రావాలనుకునే నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు.., ముందు తమ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరాలని అల్టిమేటం జారీ చేశారు.దానికి అనుగుణంగానే....ఇతర పార్టీల నుండి వచ్చే నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీ వైపు రావడానికి మొగ్గు చూపుతున్నారు.

ఎందుకంటే... పార్టీ ఫిరాయింపుల విషయంలో...2014-19 చంద్రబాబు ప్రభుత్వం లో ఒక మాయని మచ్చ పడిపోయింది...2019 లో పార్టీ దారుణంగా ఓటమి పాలై..23 స్థానాలకి పడిపోయినపుడు .., అప్పట్లో చాలా మంది పార్టీ ఫిరాయింపులు కూడా ఒక రకమైన కారణంగా చెప్పేవారు..!!

23 మందిని పార్టీ నుండి లాక్కున్నారు కాబట్టే...23 స్థానాలకు పార్టీని కుదించుతూ ప్రజాక్షేత్రంలో తీర్పును అందించారు అని 2019 లో అత్యధికంగా 151 స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఐదేళ్ల పాటు టీడీపీ పార్టీ ని ట్రోల్ చేశారు..!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను, రాజీనామా చేయించ కుండానే... టీడీపీ పార్టీ లోకి తీసుకున్నారు..!!

ఈ విషయాన్ని ప్రతిపక్ష వైసిపి పార్టీ తమకి అనుకూలంగా మార్చుకుని, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంపొందించే విషయంలో సఫలీకృతం అయ్యారు.. కానీ ఇప్పుడు చంద్రబాబు అటువంటి అవకాశం విపక్షాలకు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకొనే క్రమంలో.... పార్టీ లోకి ఎవరైనా రావాలి అనుకుంటే.... రాజీనామా చేసి రావాలని పిలుపునిచ్చారు..!! కాగా తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే... పార్టీ పిరాయింపుల విషయంలో తెలుగు దేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందా...అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి..!!

తాజాగా జగ్గయ్యపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఛైర్మెన్ రంగాపురం రాఘవేంద్ర ని రాజీనామా చేయించకుండా,కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడమే....!!!!

రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులను రాజీనామా చేసి టీడీపీ లోకి వచ్చేలా ఒక రూల్..,స్థానిక స్థాయి ప్రజాప్రతినిధులను రాజీనామా చేయకుండానే టీడీపీ లోకి కండువా కప్పి ఆహ్వానించడం...ఇది మరో రూల్..!!

మొత్తానికి పార్టీ ఫిరాయింపుల విషయంలో తెలుగు దేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని జనాలు భావిస్తున్నారు...!!!

Tags:    

Similar News