తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు పొంచి ఉన్న భారీ వర్షం ముప్పు
భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ
మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ కు సెప్టెంబర్ 8 న రెడ్ అలర్ట్ జారీ చేసింది. IMD తన తాజా పత్రికా ప్రకటనలో.. సెప్టెంబర్ 08న కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్ 08ఎం 09 తేదీల్లో కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
శనివారం విడుదల చేసిన వాతావరణ సూచన బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో వాతావరణం:
హైదరాబాద్, దాని పరిసరాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శనివారం నాడు ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం బయల్దేరి వెళ్లారు. మున్నేరు వాగు మరోసారి పొంగి పొర్లే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో భట్టి విక్రమార్క అధికారులను అప్రమత్తం చేశారు.