Pawan Kalyan : జనంలోకి 7 నుంచి జనసేనాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా జనంలోకి జనసేనాని వెళ్లనున్నారు. ఈనెల 7వ తేదీన అనకాపల్లిలో జరిగే ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. 8వ తేదీన ఎలమంచిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అస్వస్థతకు గురి కావడంతో...
ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో నాలుగు రోజులు పర్యటించిన పవన్ కల్యాణ్ జ్వరం దగ్గుతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన హైదరాబాద్ కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకున్న అనంతరం ఈ నెల 7వ తేదీ నుంచి తిరిగి ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.