YSRCP : అందుకే రాజీనామా చేస్తున్నా... అసలు విషయం చెప్పిన సంజీవ్ కుమార్

వైసీపీలో తాను కొనసాగలేనని కర్నూలు పార్లమెంటు సభ్యుడు సంజీవ్ కుమార్ తెలిపారు.

Update: 2024-01-10 11:48 GMT

వైసీపీలో తాను కొనసాగలేనని కర్నూలు పార్లమెంటు సభ్యుడు సంజీవ్ కుమార్ తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ప్పటికీ తాను ఏ పనిచేయలేక పోతున్నానని ఆయన చెప్పారు. ఐదేళ్లుగా తనలో అసంతృప్తి ఉందని సంజీవ్ కుమార్ తెలిపారు. ఎంపీగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోతున్నానని అన్నారు. నాలుగున్నరేళ్లుగా పార్టీ సిద్ధాంతాలకు లోబడి తన అసంతృప్తిని తనలోనే అణుచుకున్నానని అన్నారు. టిక్కెట్ రాలేదని తాను రాజీనామా చేస్తున్నానని చెప్పడం సరికాదని అన్నారు.

పదిసార్లు ప్రయత్నించినా జగన్...
తన భవిష‌్యత్ కార్యాచారణ త్వరలోనే తెలుస్తుందని అన్నారు. జగన్ ను కలిసేందుకు పది సార్లు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ దొరకలేదని సంజీవ్ కుమార్ తెలిపారు. అయితే ఇంకా తనను ఏపార్టీ తనను సంప్రదించలేదని అన్నారు. తన భవిష్యత్ ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తానని సంజీవ్ కుమార్ తెలిపారు. వైసీపీలో పరిస్థితులు బాగా లేవని ఆయన అన్నారు. వైసీపీలో సామాజిక న్యాయం ఉన్నప్పటికీ, అభివృద్ధి మాత్రం రాష్ట్రంలో జరగడం లేదని సంజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News