పెరిగిన రద్దీ... 20 గంటలు

ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం, వరస సెలవులు రావడంతోనే భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.;

Update: 2023-09-29 03:01 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం, వరస సెలవులు రావడంతోనే భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. దీంతో పాటు ఈరోజు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. మాడ వీధుల్లో భక్తులకు శ్రీవారు దర్శనమివ్వనున్నారు. దీంతో భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

హుండీ ఆదాయం...
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటలకు పైగానే సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 54,620 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.98 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News