Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ వివాదంపై అప్‌డేట్ వచ్చేసిందోచ్

రుమల లడ్డూ వివాదంపై లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ త్వరలోనే విచారణ ప్రారంభించనుంది.;

Update: 2024-11-06 04:24 GMT
latest update,  tirumala laddu controversy,supreme court, supreme court on tirumala laddu, latest news   tirumala laddu today

 tirumala laddu controversy

  • whatsapp icon

తిరుమల లడ్డూ వివాదంపై లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ త్వరలోనే విచారణ ప్రారంభించనుంది. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ను నియమించింది. హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ ను సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ కోసం తిరుపతిలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక ఫుడ్ సేఫ్టే నుంచి అధికారిని నియమించాల్సి ఉంది. ఈ అధికారిని నియమిస్తే ఇక తిరుమల లడ్డూ వివాదంలో విచారణ ప్రారంభమవుతుంది. తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

నెయ్యి కల్తీ విషయంలో...
తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని, అందులో జంతువుల అవశేషాలున్నాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మూడు రోజుల పాటు తిరుమలలో పర్యటించి వివిధ అంశాలను పరిశీలించింది. పలువురు అధికారులను కలసి వారి నుంచి వివరాలను సేకరించింది. ప్రశ్నించింది. అయితే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసింది.
సమయం నిర్దేశించకపోవడంతో...
సుప్రీంకోర్టు కొత్తగా ఒక సిట్ ను నియమించింది. సీబీఐ అధికారి పర్యవేక్షణలో విచారణ జరగాలని సూచించింది. దీంతో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే తిరుమల లడ్డూ వివాదంపై విచారణ త్వరలోనే ప్రారంభం కానుంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సిట్ నియమించి నెలన్నర పైనే అవుతున్నా ఇప్పటి వరకూ విచారణ ప్రారంభం కాలేదు. వరసగా ఏదో ఒకటి ఆటంకంగా మారడంతో పాటు సుప్రీంకోర్టు కూడా నిర్దేశిత సమయం విధించకపోవడంతో నిదానంగా విచారణకు సిట్ అధికారులు సిద్ధమయినట్లు తెలిసింది.


Tags:    

Similar News