నేడు, రేపు ఏపీలో వడగాలుల తీవ్రత .. ఏ స్థాయిలో అంటే?
ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు 72 మండలాల్లో తీవ్ర వడగాలులు, 200 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అనేక మండలాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.
వీరంతా జాగ్రత్తలు...
ఉదయం నుంచే ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదయ్యే అవకాశశముందని తెలిపింది. నలభై నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది.వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.