Cyclone Effect : దేవుడా... దానా నుంచి దాటించు.. దూసుకొస్తున్న తుపాను

దానా తుపాను దూసుకొస్తుంది. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

Update: 2024-10-24 04:06 GMT

Dana cyclone in AP

దానా తుపాను దూసుకొస్తుంది. తీర ప్రాంతం అంతా వణికి పోతుంది. తుపాను ఎఫెక్ట్‌తో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంతం వెంట వంద నుంచి 120 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. తూర్పు బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతుంది. ఈరోజు అర్ధరాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలపై 'దానా' తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కోల్‌కతా-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అధికారులు రద్దు చేశారు.

రైలు సర్వీసులు రద్దు...
రేపటి నుంచి 25 వరకు 66 రైలు సర్వీసులు ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజన్ రద్దు చేసింది. వాయవ్య బంగాళాఖాతంలోకి దానా తుఫాన్ గా బలపడిఒడిశా, బెంగాల్‌ తీరాలకు తాకనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆ రెండు రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది.15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతున్న దానా తుపానుపారాదీప్‌కు 280 కి.మీ, ధమర 310 కి.మీ దూరంలో ఉందని చెబుతున్నారు. సాగర్‌ ఐలాండ్‌కు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతంఅయిందని అంటున్నారు. ఈరోజు రాత్రికి పూరి-సాగర్‌ ఐలాండ్ దగ్గర తీరందాటనుందని అధికారులు తెలిపారు. ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్‌ తీరాలపై తీవ్ర ప్రభావంచూపనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
తీర ప్రాంతంలో హై అలెర్ట్...
ఆంధ్రప్రదేశ్ లోని పోర్టుల్లో రెండో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏపీలో తీర ప్రాంతంలో హై అలెర్ట్ ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని చెప్పడంతో ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. తుపాను తీరం దాటే సమయంలో ఇళ్లకే పరిమితమవ్వాలని తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో విద్యుత్తును తొలగించే అవకాశముంది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సహాయ కార్యక్రమాలకు సిద్ధం చేశారు. కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా తీర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెబుతున్నారు.


Tags:    

Similar News