రేపటి నుంచి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2022-03-03 01:41 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్యదిశగా కదులుతూ తమిళనాడు తీరానాకి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

ఆ మూడు జిల్లాల్లో...
ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావారణ శాఖ పేర్కొంది. తీరం వెంట 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని, మత్స్య కారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.


Tags:    

Similar News