హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స ఏమన్నారంటే?
రాజధాని అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.;
రాజధాని అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తీర్పు కాపీ ఇంకా తమకు చేరలేదన్నారు. దానిని పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తానని ఆయన తెలిపారు. అయితే తమ పార్టీ మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉందని బొత్స సత్యనారాయణ మీడియాకు చెప్పారు. మూడు రాజధానుల ఏర్పాటు తమ పార్టీ రాజకీయ తీర్మానమని ఆయన చెప్పారు.
చట్టాలు చేసేది....
అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలా? వద్దా? అన్నది న్యాయనిపుణులతో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటు, శాసనసభలకు చట్టాలు చేసే అధికారం ఉందని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. కంగారు పడవద్దని, త్వరలోనే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు.