విశాఖ నుంచి సీఎం పాలన
మంత్రి గుడివాడ అమరనాధ్ మరోసారి పరిపాలన రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు;
మంత్రి గుడివాడ అమరనాధ్ మరోసారి పరిపాలన రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశాఖ నుంచి ముఖ్యమంత్రి జగన్ పాలన ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి జగన్ విశాఖ రాజధానిగా పాలన కొనసాగిస్తారని చెప్పారు.
సెక్రటేరియట్ కూడా...
అయితే ముఖ్యమంత్రి విశాఖ నుంచి పరిపాలన చేస్తే సెక్రటేరియట్ కూడా వచ్చినట్లేనని ఆయన తెలిపారు. ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు కూడా విశాఖకు రావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దీనిపై ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదని మంత్రి గుడివాడ అమరనాథ్ తెలిపారు.