దోచుకో.. దాచుకో.. ఇదే బాబు సిద్ధాంతం

అమలు కానీ హామీలు ఇస్తూ.. చంద్రబాబు ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఫైర్‌

Update: 2023-05-30 10:35 GMT

అమలు కానీ హామీలు ఇస్తూ.. చంద్రబాబు ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఫైర్‌ అయ్యారు. మంగళవారం నాడు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. మహానాడు టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో టిష్యూ పేపర్‌ కన్నా హీనంగా ఉందన్నారు. మేనిఫెస్టో ఎందుకూ పనికిరాదని, అందులోని హామీలు ఒక్కటి కూడా అమలు కావన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. మేనిఫెస్టో అమలుపై చర్చకు రావాలని, ఎవరెన్నీ హామీలు అమలు చేశారో చూసుకుందాం.. అంటూ మంత్రి కారుమూరి సవాల్‌ విసిరారు.

చంద్రబాబు ముఖంలో రాజకీయంగా చావుకళ, ప్రేతకళ కనిపిస్తోందన్నారు. బాబుకు పదవీకాంక్ష, ఇంకా రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ఆలోచన వదలట్లేదన్నారు. మేనిఫెస్టోలో 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తానని చంద్రబాబు అంటున్నారని, పథకాలు ప్రజలు నమ్మేలా ఉండాలన్నారు. తల్లికి వందనం, దీపం పథకం అన్నీ అబద్దపు హామీలేనన్నారు. గతంలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి అమలు చేయలేదని, ఇప్పుడు కూడా చంద్రబాబు అదే పాట పాడుతున్నారని మంత్రి కారుమూరి విమర్శించారు. సీఎం జగన్‌ పాలనలో నిరుపేదలతో పాటు, అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్‌ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రమంతా వేడుక చేసుకుంటోందన్నారు. రాజకీయాలకు అతీతంగా, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామన్నారు. చంద్రబాబు, ఆ పార్టీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని, ప్రభుత్వంపై అదేపనిగా బురద చల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు మళ్లీ ఓడిపోవాల్సిందేనని మంత్రి కారుమూరి అన్నారు. 2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలు చేసిన చంద్రబాబు, ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. రైతుల రుణాలు రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని చెప్పి, ఆ మాట కూడా తప్పాడని గుర్తు చేశారు. దోపిడి. దోచుకో. దాచుకో.. ఇదే చంద్రబాబు సిద్ధాంతమని అన్నారు. 

Tags:    

Similar News