Nara Lokesh : మంగళగిరి వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్
మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు తీసకున్నారు
మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు తీసకున్నారు. తన సొంత నిధులతో కార్మికులను నియమించి గడ్డి తొలగింపు పనులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. సొంత నిధులతో ఐదు గడ్డి తొలగింపు మిషన్ల కొనుగోలు చేయడంతో పాటు ప్రతి నెల కార్మికులకు జీతాలు మంత్రి నారా లోకేష్ చెల్లించనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో రోడ్లకు ఇరువైపుల ఉన్న గడ్డి, పిచ్చుమొక్కలు తొలగింపు కోసం నేటి నుంచి గడ్డి తొలగింపు కార్యక్రమం ప్రారంభమయింది.
పారిశుద్ధ్య పనులను...
లోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడ్డి తొలగించేందుకు ఐదుగురు కార్మికులను నియమించారు. వీరికి అవసరమైన జీతభత్యాలను నారా లోకేష్ సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు. ఒక్కో గ్రాస్ కటింగ్ మిషన్ కొనుగోలుకు రూ.18వేల వరకు ఖర్చు చేశారు. ఆదివారం ఉదయం నుంచే మంగళగిరి పట్టణంలోని పానకాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఘాట్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో యంత్రాల సాయంతో గడ్డిని, పిచ్చి మొక్కలను తొలగించారు.