నేడు మంత్రి నారాయణ కీలక సమావేశం
మంత్రి పొంగూరు నారాయణ నేడు మున్సిపల్ అధికారులతో సమావేశం అవుతున్నారు.;

మంత్రి పొంగూరు నారాయణ నేడు మున్సిపల్ అధికారులతో సమావేశం అవుతున్నారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమవుతారుఉదయం 11 గంటలకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే లతో సమావేశం అయి మేయర్ ఎన్నికపై నారాయణ చర్చించనునన్నారు.
విశాఖ మాస్టర్ ప్లాన్ పై...
దీంతో పాటు విశాఖ మాస్టర్ ప్లాన్,అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రి నారాయణ మధ్యాహ్నం 2 గంటలకు టౌన్ ప్లానింగ్ లో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై కీలక సమావేశం నిర్వహించనున్నారు. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ అసోసియేషన్,క్రెడాయ్,నరేడ్కో ప్రతినిధులతో సమీక్ష నారాయణ చేస్తారని మంత్రి కార్యాలయం తెలిపింది.