మంత్రి కాళ్లపై పడ్డ మరో మంత్రి.. ఏపీలో ఆసక్తికర సీన్
మొన్న చెల్లుబోయిన.. నేడు సీదిరి అప్పలరాజు.. సీనియర్ నేతలకు వంగివంగి నమస్కరించడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒక మంత్రి కాళ్లపై మరో మంత్రి పడడం ఆసక్తికరంగా మారింది. జగన్ క్యాబినెట్లో వారిద్దరూ మంత్రులుగా కొనసాగుతున్నారు. అయినా ఒక మంత్రి కాళ్లపై పడిపోయారు మరో మంత్రి. శాలువాతో సత్కరిస్తుంటే కాళ్లపై పడి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గరివిడిలో జరిగింది. గరివిడిలో వెటర్నరీ కాలేజ్, స్టూడెంట్స్ హాస్టల్‌ను మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజును సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు సత్కరించారు. ఆయనను శాలువాతో సత్కరిస్తుండగా మంత్రి సీదిరి మరో మంత్రి బొత్స కాళ్లకు నమస్కరించారు. ఈ ఘటన వైరల్‌గా మారింది. కొద్దిరోజుల కిందట మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ వైసీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేశారు. ఈ రెండు ఘటనలు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారాయి. మంత్రులు అయ్యుండి కాళ్లాభివందనాలేంటోనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.