Andhra Pradesh : హైదరాబాద్‌లో ఓటేస్తే ఇక్కడ ఓటు తొలగించాల్సిందే

హైదరాబాద్ లో ఓటేసిన వారికి ఏపీలో ఓట్లు తొలగించాలని ఏపీ మంత్రులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు

Update: 2023-12-06 11:51 GMT

హైదరాబాద్ లో ఓటేసిన వారికి ఏపీలో ఓట్లు తొలగించాలని ఏపీ మంత్రులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఎన్నికల అధికారిని మంత్రులు జోగి రమేష్, వేణుగోపాల కృష్ణలు కలిశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాలుగు లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ లో ఉన్నారని, వాళ్లంతా ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు వేశారని, త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించవద్దని ఈ సందర్బంగా మంత్రులిద్దరూ ఎన్నికల కమిషనర్ ను కోరారు.

నాలుగు లక్షల ఓట్లు...
రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారు చాలా మంది ఉన్నారని తెలిపారు. డబుల్ ఎంట్రీలను తొలగించాలని తెలిపారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందని వారు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ ఓట్లు ఉన్న వారిని ఇక్కడ జాబితా నుంచి తొలగించాలని కోరారు. దేశంలో ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలన్న నిబంధనను అమలులో పర్చాలని తాము ఎన్నికల కమిషన్ ను కోరినట్లు మంత్రులు జోగి రమేష్, వేణుగోపాల కృష్ణలు తెలిపారు.


Tags:    

Similar News