Andhra Pradesh : ఎక్కడి చెత్త అక్కడే.. పొంచి ఉన్న కరోనా
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఎక్కడి చెత్త అక్కడే ఉంది. కరోనా వైరస్ ప్రబలుతోంది
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. తమకు 24 వేల రూపాయల వేతనం ఇవ్వాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే 21 వేల రూపాయలు ఇచ్చేందుకు జీతం ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసింది. తమకు కనీస వేతనం 24 వేలు చెల్లించాల్సిందేనని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. దీంతో ప్రభుత్వంతో కార్మిక సంఘాలు అనేక దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది.
కొనసాగుతుండటంతో...
మున్సిపల్ కార్మికుల సమ్మె కొంత కాలం నుంచి కొనసాగుతుండటంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. పైగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో చెత్త పేరుకుపోవడం కూడా ఆందోళనకు గురి చేస్తుంది. కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం దించి చెత్తను తొలగించే ప్రయత్నం చేసినా అందుకు కార్మిక సంఘాలు అడ్డుకుంటున్నాయి. దీంతో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధభరిత వాతావారణం నెలకొంది.