కారంచేడులో బాలకృష్ణ గుర్రపు స్వారీ
నందమూరి బాలకృష్ణ ప్రకాశం జిల్లాలోని కారంచేడులో సందడి చేశారు.;
నందమూరి బాలకృష్ణ ప్రకాశం జిల్లాలోని కారంచేడులో సందడి చేశారు. సంక్రాంతి పండగకు సోదరి పురంద్రేశ్వరి అత్తగారిల్లైన కారంచేడుకు బాలకృష్ణ కుటుంబం చేరుకుంది. మూడు రోజుల నుంచి బాలకృష‌్ణ కారంచేడులోనే ఉన్నారు. ఆయనతో పాటు భార్య, కుమారుడు మోక్షజ్ఞతో పాటు సోదరుడి కుటుంబ సభ్యులతో కలసి బాలకృష్ణ కారంచేడుకు వెళ్లారు.
ఆయనను చూసేందుకు....
ఆయన ఈరోజు కారంచేడులో గుర్రపు స్వారి చేసి సందడి చేశారు. మోక్షజ్ఞ కూడా గుర్రం ఎక్కి కారంచేడులో తిరిగారు. బాలకృష్ణ ను చూసేందుకు కారంచేడు ప్రజలు వచ్చారు. ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో బాలకృష్ణ వారందరితో కాసేపు గడిపారు.