Nara Lokesh : రేపటి నుంచి లోకేష్ శంఖారావం

రేపటి నుంచి నారా లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభం కానుంది. శంఖారావం పేరుతో ఈ యాత్రను నారా లోకేష్ చేస్తున్నారు;

Update: 2024-02-10 05:15 GMT
NaraLokesh, Yuvagalam, YuvagalamPadayatra, LokeshNara, ChandrababuNaidu, TDP
  • whatsapp icon

రేపటి నుంచి నారా లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభం కానుంది. శంఖారావం పేరుతో ఈ యాత్రను నారా లోకేష్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు చేశారు. ఈరోజు రాత్రికి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం నుంచి శంఖారావం యాత్ర ప్రారంభం కానుంది.

రోజుకు మూడు నియోజకవర్గాల్లో...
మొత్తం 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర జరపనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యలో పార్టీ క్యాడర్ ను, నేతలను సమాయత్తం చేసేందుకు లోకేష్ ఈ యాత్రను చేపట్టారు. యువగళం పాదయాత్రలో టచ్ చేయని నియోజకవర్గాలలో ఎక్కువగా ఈ యాత్ర సాగనుంది. రోజుకు మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. కార్యకర్తలు, ప్రజలతో సమావేశమై టీడీపీ అధికారంలోకి వస్తే తాము ఏం చేయనున్నామో వివరించనున్నారు.


Tags:    

Similar News