జగన్ హయాంలో భారీ మద్యం కుంభకోణం.. ఎన్ని వేల కోట్లంటే?

గత ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు;

Update: 2025-03-25 01:45 GMT
liquor scam, jagan, lavu srikrishna devarayalu, loksabha
  • whatsapp icon

గత ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఒక కంపెనీ పేరుతో దుబాయ్ కి మళ్లించారని ఆయన ఆరోపించారు. నాటి ముఖ్యమంత్రి జగన్ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్ కి రెండువేల కోట్లు మద్యం డబ్బు తరలించారని లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. జగన్ హయాంలో భారీ మధ్యం కుంభకోణం జరిగిందని,. 20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారని తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కన్నా జగన్ మధ్యం కుంభకోణం అతి పెద్దదంటూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కామ్ చేసిన ఘనత జగన్ దేనని, జగన్ తన ఆధీనంలోని సంస్థల ద్వారా మద్యం వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించి ప్రజలను మోసం చేశారని, ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి, అధ్వాన్నమైన నాణ్యత కలిగిన కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టారని లావు తెలిపారు. నంద్యాలలోని ఎస్.పి.వై ఆగ్రో ఇండస్ట్రీస్ లాంటి ప్రముఖ డిస్టిలరీలను బలవంతంగా తీసుకుని, కొత్త బినామీ డిస్టిలరీలను ఏర్పాటు చేశారన్న లావు తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి, వేల కోట్ల రూపాయలు అధికార పార్టీ అనుబంధ వ్యాపారస్తుల చేతికి వెళ్లేలా చేశారని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్ సభలో అన్నారు.


Tags:    

Similar News