నేడు నీతి అయోగ్ సీఈవోతో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు నీతి అయోగ్ సీఈవో సమావేశం కానున్నారు

Update: 2024-10-30 02:25 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు నీతి అయోగ్ సీఈవో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరు, ఇతర అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. దీంతో పాటు చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు.

కలెక్టర్లతో మీట్...
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరుపై కలెక్టర్లతో చంద్రబాబు, నీతి అయోగ్ సీఈవో చర్చించనున్నారు. రానున్న కాలంలో జిల్లాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను కూడా రూపొందించాలని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించనున్నారు.


Tags:    

Similar News