Tirumala : ఆపదమొక్కుల వాడా.. పాహిమాం.. పాహిమాం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్న్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్న్నారు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. వసతి గృహాలు దొరకక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. క్యూ లైన్ లలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో టీటీడీ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నేడు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
కిటకిటలాడుతున్న తిరుమల...
తిరుమల కొండపై అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. మాడవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట శిలాతోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. దీంతో క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలను శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడుగంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,467 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 40,005 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.