ఏపీలో ఉధృతంగా పోలింగ్..11 గంటలకు ఎంత శాతమయిందంటే?

ఆంధ్రప్రదేశ్ లో పదకొండు గంటల సమయానికి 24 శాతం ఓట్లు పోలయినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.;

Update: 2024-05-13 06:31 GMT
ఏపీలో ఉధృతంగా పోలింగ్..11 గంటలకు ఎంత శాతమయిందంటే?
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ 24 శాతం నమోదయింది. ఉదయం పదకొండు గంటల సమయానికి 24 శాతం ఓట్లు పోలయినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. అత్యధికంగా కడప జిల్లాలో పోలింగ్ శాతం నమోదయిందని అధికారులు తెలిపారు.

అత్యధికంగా కడపలో...
ఆంధ్రప్రదేశ్ లో 24 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఊహించని విధంగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో పోలింగ్ నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. కడపలో 27.02 శాతం పోలింగ్ నమోదయింది. కాగా, తెలంగాణలో 24.25 పోలింగ్ నమోదయింది.


Tags:    

Similar News