లారీలో కరెన్సీ నోట్లు.. హైదరాబాద్ నుంచి గుంటూరుకు... పట్టుబడిన 8.9 కోట్లు

హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న 8.90 కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.;

Update: 2024-05-09 02:48 GMT
8.90 crore,  seized, lorry, hyderabad to guntur, election code, money seized
  • whatsapp icon

ఎన్నికల్లో నగదును పంచడానికి రాజకీయపార్టీలు అనేక మార్గాలు ఎంచుకుంటున్నాయి. ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులను కూడా వదలకుండా పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో లారీలో తరలించేందుకు సిద్ధపడ్డారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న 8.90 కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గరికపాడు చెక్ పోస్టు వద్ద...
గరికపాడు చెక్ పోస్టు వద్ద జరిపిన ఫ్లియింగ్ స్క్కాడ్ కు లారీల్లో ఉన్న కరెన్సీ కట్టలను చూసి మతిపోయింది. మొత్తం లెక్కించగా 8.90 కోట్ల రూపాయలు ఉందని గుర్తించారు. ఈ డబ్బును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు నిందితులు చెప్పారు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.



Tags:    

Similar News