జనసేన ఇన్ ఛార్జిపై పవన్ ఆగ్రహం
ప్రత్తిపాడు జనసేన ఇన్‌చార్జ్‌పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.;

ప్రత్తిపాడు జనసేన ఇన్‌చార్జ్‌పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి వైద్యురాలిపై వరుపుల తమ్మయ్య తీరు వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు.చట్టప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. జనసేన ఇన్ ఛార్జి వైద్యురాలిపై వ్యవహరించిన అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నివేదిక కోరిన...
విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ వెంటనే దీనిపై స్పందించారు. అయితే వరుపుల తమ్మయ్య వ్యవహరించిన తీరును పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు జనసేన కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌కు పవన్ కల్యాణ్ ఆదేశించారు. తప్పుఉంటే చర్యలు తీసుకోవాలని కోరారు.