Pawan Kalyan : వాళ్లను వ్యూహం సినిమా తీసుకోండి.. మన వ్యూహం మాత్రం ఇదే

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే దేశానికే ముప్పు అని ఆయన వ్యాఖ్యానించారు.;

Update: 2024-03-12 12:46 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే దేశానికే ముప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే వైసీపీని ఓడించడానికి తాను తగ్గాల్సి వచ్చిందన్నారు. అందరినీ ఏకం చేయడంలో తాను కీలకంగా మారడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాళ్లను వ్యూహం సినిమా తీసుకోనివ్వాలని, మన వ్యూహం మనం వేసుకుందామని పవన్ అన్నారు. టీడీపీ నేత పులవర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భీమవరాన్ని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసునని పవన్ కల్యాణ్ అన్నారు.

భీమవరాన్ని కాపాడుకుందాం...
భీమవరాన్ని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసునన్న పవన్ కల్యాణ్, రామాంజనేయులు చేరిక జనసేనకు కీలకమని తెలిపారు. తాను 2019 ఎన్నికల్లో ఓటమిపాలయినా జనం గుండెల్లో నిలిచానంటూ కామెంట్ చేశఆరు. భీమవరం పట్టనం ఒక రౌడీ చేతిలో బందీగా మారిందని, కోటీశ్వరులుండే భీమవరం ఒక్క వ్యక్తి చేసిన తప్పు అతని కులం, వర్గంపై పడుతుందని అన్నారు. యుద్ధం లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయడమని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ ను ఓడించడమే అందరి కర్తవ్యమని ఆయన తెలిపారు. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుందని, బంధుత్వాలు ఉండవని కూడా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News