మళ్లీ కలుస్తాం.. కార్యాచరణపై చర్చిస్తాం

జనసైనికులపై అక్రమ అరెస్ట్ లు చేయడాన్ని ఖండిస్తూ తనకు సంఘీభావన్ని తెలిపేందుకు చంద్రబాబు వచ్చారని పవన్ కల్యాణ్ తెలిపారు

Update: 2022-10-18 11:53 GMT

జనసైనికులపై అక్రమ అరెస్ట్ లు చేయడాన్ని ఖండిస్తూ తనకు సంఘీభావన్ని తెలిపేందుకు చంద్రబాబు వచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు బతకాలంటే ప్రజాస్వామ్యం బతకాలని పవన్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ లో ఇలా జరగకుండా ఉండాలంటే అవసరమైతే పది సార్లు మాట్లాడుకుంటామని, ఎన్నికల అంశం కాదని, ప్రజాస్వామ్యాన్ని బతికించుకునేందుకే ఈ సమావేశాలు అని ఆయన తెలిపారు.

ఒక్కరోజులో తేలవు...
పొత్తులు అనేది ఒక్కరోజులో తేలేది కాదని, ఆరోజు అవసరాలను బట్టి అప్పుడు నిర్ణయించుకుంటామని పవన్ తెలిపారు. తనకు చాలా మంది ఫోన్ చేసి తనకు మద్దతు తెలిపారన్నారు. తెలంగాణ నుంచి కూడా తనకు మద్దతు లభించిందన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం లు కలసి పోరాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. జనసైనికులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు.


Tags:    

Similar News