రాపాకకు నో ఎంట్రీ

జనసేన సభకు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అనుమతి లేదని సభా ప్రాంగణంలో పెద్దయెత్తున పోస్టర్లు వెలిశాయి;

Update: 2022-03-14 13:52 GMT
rapaka varaprasad, mla, janasena formation day
  • whatsapp icon

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సభకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అనుమతి లేదని సభా ప్రాంగణంలో పెద్దయెత్తున పోస్టర్లు వెలిశాయి. జనసేన ఆవిర్భావ సభ మంగళిగిరి ప్రాంతంలోని ఇప్పటం గ్రామంలో ప్రారంభమయ్యాయి.

ఎమ్మెల్యేగా గెలిచి....
రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో జనసేన నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచారు. ఫలితాల అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేయకుండానే ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో రాపాక వరప్రసాద్ కు సభకు అనుమతి లేదని పోస్టర్లు వెలియడం చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News