గవర్నర్ తమిళి సై తో కేఏ పాల్ భేటీ

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయంగా ఉందని, ఇంత అవినీతిని తానెప్పుడూ చూడలేదన్నారు. కేసీఆర్ త్వరలోనే అరెస్ట్..

Update: 2022-04-13 11:04 GMT

హైదరాబాద్ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ మత బోధకుడు కేఏ పాల్ తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తో భేటీ అయ్యారు. గవర్నర్ తో పలు అంశాలపై చర్చించిన కేఏ పాల్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయంగా ఉందని, ఇంత అవినీతిని తానెప్పుడూ చూడలేదన్నారు. కేసీఆర్ త్వరలోనే అరెస్ట్ కావడం ఖాయమని కేఏ పాల్ జోస్యం చెప్పారు.

కేసీఆర్ కు కళ్లు నెత్తికి ఎక్కాయని, ఆయన అక్రమ పాలనను అంతం చేయడానికే తాను అమెరికా నుంచి వచ్చినట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 30 సీట్లు కూడా రావని ప్రశాంత్ కిశోర్ చెప్పారన్నారు. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జార్జ్ బుష్, బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు తానే తీసుకు వచ్చాన‌ని, తెలంగాణ‌లో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తానేన‌ని కేఏ పాల్ ధీమా వ్య‌క్తం చేశారు.




Tags:    

Similar News