జగన్ ను సీక్రెట్ గా నైనా కలుస్తా
ప్రజాశాంతి పార్టీలో చేరేందుకు ఐఏఎస్, ఐపీఎస్ల చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.
ప్రజాశాంతి పార్టీలో చేరేందుకు ఐఏఎస్, ఐపీఎస్ల చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. విజయవాడలో మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. నేషనల్ మీడియా ఒత్తిళ్లకు లొంగిపోయిందని పాల్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై సీబీఐ ఈడీలతో దాడులు చేయిస్తున్నారన్నారు. భారత్ మరో శ్రీలంకలా మారుతుందని ఆయన జోస్యంచెప్పారు. కేంద్రం అప్పులు చేసి పబ్బం గడుపుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని కేఏ పాల్ అన్నారు. అదానీకి అన్యాయంగా ఆస్తులు అప్పగించడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేసేదేమీ లేదని పాల్ అన్నారు.
చంద్రబాబు మాత్రం....
ఆంధ్రప్రదేశ్ నాశనం కావడానికి నలుగురు ప్రధాన కారణమన్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన సలహాలను పట్టించుకోలేదన్నారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారన్నారు. చంద్రబాబుకు వయసు మళ్లిందని, ఆయనకు ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓట్లువేయవద్దని పిలుపు నిచ్చారు. ఏపీలో టీడీపీ భూస్థాపితం ఖాయమన్నారు. చంద్రబాబు ఇక గెలిచే పరిస్థితి లేదన్నారు. మోదీని ఎదిరించే ధైర్యం చేయలేదన్నారు. జగన్ కుటుంబం అంటే తనకు గౌరవమని, ఆయన తనను కలిసేందుకు ఇష్టపడటం లేదన్నారు. జగన్ తనను సీక్రెట్ గానయినా ఆహ్వానిస్తే వెళతానని, రాష్ట్ర ప్రజలకు జగన్ మేలు చేయాలని కేఏ పాల్ కోరారు. తనను కలిస్తే ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతానని తెలిపారు. జగన్ ను నాడు చంద్రబాబు ఏడిపించాడని, ఇప్పుడు చంద్రబాబు ఏడుస్తున్నాడని కేఏ పాల్ అన్నారు.