శ్రీకాళహస్తిలో నిలిచిన రాహుకేతు పూజలు
శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. నాగపడగల కొరతతో పూజలు నిలిచిపోయాయి.;
శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. నాగపడగల కొరతతో పూజలు నిలిచిపోయాయి. పూజలకు నాగపడగలను అధికారులు సిద్ధం చేయలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లలోనే నిల్చుని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నాగపడగలను సిద్ధం చేసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని భక్తులు ఆరోపిస్తున్నారు.
తిరుమల నుంచి నేరుగా....
శ్రీకాళహస్తి ఆలయం రాహు కేతు పూజలకు ప్రత్యేకం. తిరుమల వచ్చిన భక్తుల్లో అనేక మంది శ్రీకాళహస్తి వచ్చి దోష నివారణ కోసం రాహుకేతు పూజలు చేయించుకుంటారు. అయితే తిరుమలలో గత కొన్ని వారాలుగా ఎక్కువగా ఉంది. పరీక్ష ఫలితాలు వెలువడటంతో మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తి వస్తారని తెలిసి కూడా అధికారులు నాగపడగలను సిద్ధం చేయడంలో విఫలమయ్యారు.