వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఆలయాలపై దాడులు పెరిగాయని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఆలయాలపై దాడులు పెరిగాయని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఆలయాలపై జిరుగుతున్న దాడులను ప్రశ్నిస్తే బీజేపీ నేతలపైనే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. దేశంలో 80 శాతం హిందువులున్నా ఇరవై శాతం ఉన్న మైనారిటీలకు రాజ్యాంగం రక్షణ కల్పించిందన్న విషయాన్ని టీజీ వెంకటేష్ గుర్తు చేశారు. మైనారిటీలకు భారత్ లో ఉన్న రక్షణ మరెక్కడా లేదని ఆయన అన్నారు.
మైనారిటీలు....
ఈ విషయాన్ని మైనారిటీలు గుర్తుంచుకోవాలని అన్నారు. భారతీయులంతా అన్నదమ్ములంతా మైనారిలీుగా భావించాలని ఆయన కోరారు. మైనారిటీల్లో అతి కొద్దిమంది మాత్రమే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. హిందువులకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తే మతోన్మాదం ముద్ర వేస్తారన్నారు. బీజేపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం కావాలని టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. మూడేళ్ల కాలం పూర్తయిందని, క్యాడర్ ఇక ఎన్నికలకు సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు.