TDP : రాయచోటిలో టీడీపీకి భారీ షాక్?

రాయచోటి టిడిపి ఇన్‌ఛార్జి రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి త్వరలోనే వైసీపీలో చేరే అవకాశాలున్నాయి;

Update: 2024-04-07 02:46 GMT

రాయచోటిలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. రాయచోటి టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి తో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రమేష్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.

త్వరలోనే వైసీపీలో చేరేందుకు...
రెడ్డప్పగారి రమేష్ రెడ్డిని పార్టీలో చేరాలని ఆహ్వానించారు. వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరితే తగిన ప్రాధాన్యత కల్పిస్తామని వారిచ్చిన హామీతో రమేష్ కుమార్ రెడ్డి కొంత మెత్తబడినట్లు తెలిసింది. వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడానికి సుముఖత చూపడంతో అతి త్వరలో తేదీని ప్రకటించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు.


Tags:    

Similar News