నెల్లూరులో రొట్టెల పండగ ప్రారంభం

నెల్లూరులో రొట్టెల పండగ ప్రారంభమయింది. ఈ పండగ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

Update: 2024-07-17 03:56 GMT

నెల్లూరులో రొట్టెల పండగ ప్రారంభమయింది. ఈ పండగ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. నెల్లూరులో రొట్టెల పండగ కోసం ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు వచ్చి తమ కోర్కెలు తీరాలని మొక్కులు మొక్కుకుంటారు. ఒక్కో కోరికకు ఒక్కో రొట్టెను ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది. ఏటా మొహరం సందర్భంగా రొట్టెల పండగను నిర్వహిస్తూ వస్తున్నారు.

అధికారిక పండగ...
రాష్ట్ర ప్రభుత్వం ఈ పండగను అధికారికంగా నిర్వహిస్తుంది. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి రోజు వేలాది మంది భక్తులు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రొట్టెల పండగ మొత్తం ఐదు రోజుల పాటు జరుగుతుంది. రేపు గంధమహోత్సవం జరుగుతుందని బారా షాషిద్ దర్గా కమిటీ నిర్వాహకులు చెప్పారు. మసీదు చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పకడ్బందీగా ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.


Tags:    

Similar News