Tirumala : ఎంత పెద్ద క్యూలైన్ అంటే.. దర్శనానికి ఒకరోజు సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది

Update: 2024-06-01 03:34 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. భక్తులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్ లో ఉన్న వారికి ఉచితంగా మంచినీళ్లు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 67,873 మందిభక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడుగంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News