Tirumala : తిరుమలలో ఆదివారం బయట వరకూ భక్తుల క్యూలైన్ ఎంత పొడవు ఉందో చూశారా?

తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కావడంతో కొనసాగుతూనే ఉంది

Update: 2024-08-18 03:19 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కావడంతో కొనసాగుతూనే ఉంది. తిరుమలలో అధిక సంఖ్యలో భక్తులు ఉండటంతో దర్శన సమయం కూడా భక్తులకు ఆలస్యమవుతుంది. వరసగా ఐదు రోజులు సెలవు దినాలు రావడంతో తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని అధికారులు చెబుతున్నారు. రేపు కూడా సెలవు దినం కావడంతో నేడు తిరుమలకు భక్తులు పోటెత్తారు. కేవలం ఏపీ, తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. మాడ వీధుల్లోనూ భక్తులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవలు ఉచితంగా భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. రేపు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశముందని చెబుతున్నారు.

అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి...
సాధారణంగా శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. తమకు సెలవులు చూసుకుని ముందుగా దర్శన టిక్కెట్లు బుక్ చేసుకుని వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కాంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి బయట ఏటీజీహెచ్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ టోకెన్ తీసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,807 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 38,340 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News