నేడు సీనియర్ నేతలలో చంద్రబాబు సమావేశం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు;

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సీనియర్ నేతలతో ఆయన చర్చించనున్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తే బాగుంటుందన్న దానిపై సీనియర్ నేతల ఒపీనియన్ తీసుకోనున్నారు.
నాలుగు స్థానాలకు...
ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందులో ఒకటి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు రిజర్వ్ అయింది. మిగిలిన నాలుగు సీట్లలోనే టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అందుకోసమే నేడు జరిగే సమావేశంలో సీనియర్ నేతల అభిప్రాయాన్ని చంద్రబాబు తెలుసుకుని తగిన నిర్ణయం తీసుకోనున్నారు.