జగనన్న వెంటే ఉంటా : ఎమ్మెల్యే జొన్నలగడ్డ
తాను పోరాడుతుంది అధికారులతోనే కాని, వైసీపీ అధినేత జగన్ పైన కాదని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.;
తాను పోరాడుతుంది అధికారులతోనే కాని, వైసీపీ అధినేత జగన్ పైన కాదని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఒక వర్గం మీడియా తనపై తప్పుడు కథనాలను రాస్తుందని అన్నారు. జగన్ ను కలసి వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తాను అన్న ప్రతి మాటలను జగనన్న కు ఆపాదించారని అన్నారు. తనకు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తాను ప్రస్తావించాను తప్పించి ఆయనను ఏనాడు వ్యతిరేకించలేదన్నారు. తాను పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలపై మాత్రమే విమర్శలు చేశానని అన్నారు.
తప్పుడు ప్రచారం చేస్తే?
ఎవరి కుటుంబంలో విభేదాలు లేవని ఆమె ప్రశ్నించారు. జగనన్న కోరుకున్న విధంగా 175 స్థానాలలో విజయం సాధించాలని అన్నారు. తాను ఎన్నడూ జగనన్న సైనికురాలినేని అన్నారు. జగన్ పై వ్యతిరేక ప్రచారం చేసే వారంతా ఖచ్చితంగా రాష్ట్ర సరిహద్దులు దాటి పోవాల్సిందేనని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. జగనన్న వద్ద ఎమ్మెల్యేగా ఉండటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అన్నారు. తాను సరైన మార్గంలోనే వెళుతున్నానని అన్నారు.