శ్రీశైలం ప్రాజెక్టు వరద పోటు
శ్రీశైలానికి వరద ఇంకా కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు
శ్రీశైలానికి వరద ఇంకా కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 2,71,505 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3,45,290 క్యూసెక్కులు ఉంది.
పూర్తి స్థాయి నీటి మట్టం...
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884.70 అడుగుల మేర నీటి మట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.8824 టీఎంసీల నీటినిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమల జల విద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది.