సాయి వర్సిటీ ఇతర యూనివర్సిటీలకు భిన్నం
విద్యార్థులు తమ భవిష్యత్ ను తీర్చిదిద్దుకునేందుకు విన్నూత్న ఆలోచనలు చేయాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
విద్యార్థులు తమ భవిష్యత్ ను తీర్చిదిద్దుకునేందుకు విన్నూత్న ఆలోచనలు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పుట్టపర్తిలోని సత్యతసాయి 40 స్నాతకోత్సవంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థి దశను ముగించుకుని కీలక దశలోకి వెళుతున్న వారు సరైన దిశను ఎంచుకోవాలని ఆయన సూచించారు. సత్యసాయి యూనివర్సిటీ ప్రాముఖ్యతను జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. విలువలతో కూడిన విద్యను అందించాలని ఆయన కోరారు. అప్పుడే ప్రపంచాన్ని మార్చవచ్చని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. సత్యసాయి సూచించిన సేవా మార్గంలో నడవాలాని విద్యార్థులకు ఉద్భోదించారు.
పూజలు చేసి...
ఆధునిక గురుకులాలకు సత్యసాయి యూనివర్సిటీ ఒక నమూనా అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మిగిలిన యూనివర్సిటీలతో పోలిస్తే ఈ యూనివర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలను, 24 మందికి డాక్టరేట్లను జస్టిస్ రమణ అంద చేశారు. అంతకు ముందు ఆయన సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.