Chandrababu : పోలీసులను అలెర్ట్ చేసిన చంద్రబాబు

కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఘర్షణల విషయంపై చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నారు;

Update: 2024-06-07 12:49 GMT
chandrababu, tdp, seats, ycp,  ys jagan, political news, andhra news, appolitics

appolitics

  • whatsapp icon

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగు దేశం పార్టీ క్యాడర్ కు చంద్రబాబు సూచించారు.

నాయకులు అప్రమత్తం గా ఉండి....
ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. ఈ విషయంలో పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పూర్తి సంయమనం పాటించాలని కోరారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News