బటలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సిందేనా?

హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు;

Update: 2022-08-09 12:52 GMT

హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తుందని ఆయన అన్నారు. సిగ్గులేని వాళ్లే తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వారి ముఖ్యమంత్రి జగన్ కఠినంగా మందలించాలని ఆయన కోరారు.

భయం లేకపోవడంతోనే...
ఒకరిపై చర్యలు తీసుకుంటేనే మిగిలిన వారికి భయం ఉంటుందని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయని చంద్రబాబు అన్నారు. రౌడీలే పోలీసులను చంపే పరిస్థితి ఏర్పడిందని ఆయన దుయ్యబట్టారు. సంఘ విద్రోహశక్తులు పేట్రేగి పోతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.


Tags:    

Similar News